ఏడు చేపల బూతు కథ..షేక్ అవుతోన్న యూట్యూబ్

0

టాలీవుడ్‌లో అప్పుడ‌ప్పుడు చాలానే డిఫరెంట్ కథలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్‌100 లాంటి చిత్రాలు యువ‌త‌ను టార్గెట్ చేస్తూ వాళ్ళ‌ను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. కొన్ని టీజర్స్, ట్రైలర్ లతోనే ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మీ..టూ ఉధ్య‌మం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బ‌య‌ట‌పెడుతూ చాలామంది ప్ర‌ముఖుల్ని బ‌జారుకీడుస్తున్నారు. అయితే ఏడుచేప‌లక‌థ చిత్రంతో ర‌వి అనే వ్య‌క్తి మీ..టూ అంటూ మ‌న ముందుకు వ‌స్తున్నాడు. ఈ నేపధ్యంలో ప‌క్కా అడ‌ల్ట్ కంటెంట్‌తో తెర‌కెక్కిన‌, ఏడు చేపల కథ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు శామ్ జే చైతన్య. ఇక తాజాగా ఈ చిత్ర‌ టీజర్ అలా విడుద‌ల చేశారో లేద‌దో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు… నీకుంట‌ద‌మ్మో.. మా అమ్మ‌కి చెబుతా.. మీ..టూ అంటూ విడుద‌లైన ఏడుచేప‌ల క‌థ టీజ‌ర్ యూట్యూబ్‌ను ఉపేస్తోంది. ఈ టీజర్‌లో కనిపించి అమ్మాయిలంద‌రితో అన్‌లిమిటెడ్‌గా అందాలు ఆర‌బోయించిన ద‌ర్శ‌కుడు, లిప్‌లాక్‌కు బెడ్‌రూం సీన్ల‌తో టీజ‌ర్ మొత్తాన్ని నింపేశాడు. దీంతో యూట్యూబ్‌లో ఈ టీజ‌ర్ ప్ర‌భంజంనం సృష్టిస్తోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 16 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌టంతో న‌యా రికార్డ్ క్రియేట్ చేసింది ఏడుచేప‌ల‌క‌థ టీజ‌ర్. దీంతో టాలీవుడ్‌లో ఏడుచేప‌ల‌క‌థ హాట్ టాపిక్ అవుతోంది.

Share.

About Author

Leave A Reply