ఢిల్లీలో కాలుష్యానికి బోనస్ గా కంపు

0

sanitation workers dharna_apduniaఢిల్లీలో కాలుష్యానికి కంపు తోడు కావడంతో నగర వాసులు నానా అవస్థలు పడుతున్నారు. జీతాలు ఇవ్వడం లేదని ఈస్ట్ ఢిల్లీ మున్సిపాలిటీ కార్మికులు సమ్మెకు దిగడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీధులన్నీ కంపుకొడుతున్నాయి. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం జీతాలకు కావాల్సిన నిధులు విడుదల చేశామని, కార్మికుల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తోంది. ఈస్టర్ ఢిల్లీలో బీజెపీ కౌన్సిలర్లు ఉన్నారని, వారే కావాలని కార్మికులను రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారని అంటోంది. ప్రభుత్వం ట్రక్ ల ద్వారా చెత్తను తొలగిస్తామని చెబుతున్నా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేందంటున్నారు జనం. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో క్లారిటీ రాకపోవడంతో సమ్మెను కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

Share.

Comments are closed.