తలుపులమ్మ క్షేత్రంలో తప్పులే తప్పులు

0

thalupulamma_apduniaరాష్ట్రంలోనే ఆ దేవస్థానం పేరుగాంచిన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు తలుపులమ్మ లోవ క్షేత్రం బకాసురుల మధ్య మగ్గిపోతుంది. ఏ పాటదారులో ఏ బయట వాళ్లో దేవస్థానం ఆదాయంకు గండీకొడితె ఓకే కానీ ఆలయ అధికారులు, సిబ్బంది కలిసి కోట్లాది రూపాయలు కనుమరుగు చేస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు కూర్చోంది. అన్న దానిపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. నిన్న మెన్నటి వరకు ఉన్న ఆలయ అధికారి ఒకరి అవినీతి భాగోతం వరుసగా బయటపడింది. అది మరవక ముందే మరో భారీ దంద బయట పడింది. ఆలయదుకాణాలు, పాటలకు సంబంధించి దేవస్థానానికి ఒక కోటి ముప్పై ఏడు లక్షలు బకాయి కనిపించడం అది బినామి పేర్లతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు లోవ దేవస్థానం ఉద్యోగులే ఈ గోల్మాల్ కు పాల్పడ్డారని దేవస్థానంలో కోడైకూస్తోంది. గతేడాది బినామి పేర్లతో ఈ నలుగురు పాటలు పాడించి, డబ్బులు సైతం వసూళ్ళు చేసి దేవస్థానానికి గండి కోట్టారని స్వయంగా అధికారులే చెబుతున్నారు. దాదాపు కోటి 37 లక్షలలో మాజీ అధికారికి ఈ నలుగురు ఉద్యోగులు భారీ మొత్తంలో ముట్ట చెప్పారని, దీనికి గాను మాజీ అధికారికి ఒక నోటు రాసి ఇచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహరంపై ఉన్నత అధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దేవస్ధానం కు సైతం గత నాలుగు రోజులుగా ఈ నలుగురు ఉద్యోగులను రానివ్వడం లేదని సమాచారం.

Share.

Comments are closed.