వైరల్ గా మారుతున్న మోడీ ట్రాఫిక్ సెన్స్ వీడియో

వైరల్ గా మారుతున్న మోడీ ట్రాఫిక్ సెన్స్ వీడియప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన స్ఫూర్తిదాయక వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు దోహదపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు వీడ్కోలు చెప్పి కారు ఎక్కి కూర్చోగానే ముందు సీటు బెల్టు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రయాణికుల్లో అవగాహన కోసం చేపడుతున్న ‘సడక్ సురక్షా జీవన్ రక్షా’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు ధరించి ఉంటే 45-60 శాతం ప్రాణాపాయం తప్పుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. గత సంవత్సరం మారుతీ సుజుకి సంస్థ చేసిన ఓ సర్వేలో దేశంలో 25 శాతం కారు ప్రయాణికులు మాత్రమే సీటు బెల్టు పెట్టుకుంటున్నారని తేలింది. ప్రధానిని చూసైనా కొంతమంది సీటు బెల్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే సంతోషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com