ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి

0

TDP and YSRCP_apduniaఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హీట్ ఇప్ప‌టి నుంచే మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఎంత‌? అన్న‌ది తేల్చుకునేందుకు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. 22 స్థానాల్లో ఎవరు ఎన్ని దక్కించుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అస‌లు వార్‌లో ఎవ‌రున్నారో తేలిపోతుంది. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా నిల‌వాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌నీసం స‌గం సీట్ల‌ను గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ పార్టీ గెల‌వ‌కుండా నిలువ‌రించేందుకు టీడీపీ ఎత్తుకు పై ఎత్తులెన్నో వేస్తోంది. క‌నీసం అర‌డ‌జ‌ను స్థానాల్ని అయినా ప్రతిపక్షం నిలుపుకోగ‌ల‌దా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. ఇంత వేడిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డం ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ఇక ఎమ్మెల్సీలుగా గెలుపు క‌ష్టం. 2019 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌ని భావిస్తున్నారట‌.

Share.

Comments are closed.