సికింద్రాబాద్ లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయండి అధికారులకు మంత్రి పద్మారావు ఆదేశం పేదలు ఉపకరించేలా కృషి చేయాలని శ్రేణులకు సూచన

సికింద్రాబాద్ పరిధిలో ఆగష్టు 15 వ తేది నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ లక్ష్యాల మేరకు పెదలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగిన్సుకోనేలా ఏర్పాట్లు జరపాలని రాష్ట్ర మంత్రి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ తీరు తెన్నుల పై అధికారులతో సోమవారం సమీక్షించారు. అధికారులకు ఆదేశాలు జారి చేశారు. తార్నాక పరిధిలో తొలి దశలో ప్రొఫెసర్ జయశంకేర్ స్టేడియం, అడ్డగుట్ట లో అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్, సీతాఫల్ మండి లో కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, మెట్టుగూడ లో విజయపురి కమ్యూనిటీ హాల్, బౌద్దనగర్ లో బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణాలను కంటి వెలుగు నేత్ర పరిక్షలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమీషనర్ రవికుమార్ నేతృత్వంలో ఇంజనీరింగ్, యూసీడీ, శానిటేషాన్ వంటి వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తో ప్రతి కేంద్రంలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిపుణులైన నేత్ర వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరిక్షలు జరుగుతాయి. రోజుకు ఒక్కో కేంద్రంలో ౩౦౦ కి పరిక్షలు ఉచితంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరిపాం. ఇప్పటికే అధికారుల బృందాలు బస్తిల్లో పర్యటించి తేదిల వారిగా టోకెన్ లను కూడా పంపిణి చేస్తున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లలో కార్పోరేటర్లు, వార్డ్ సభ్యులు, డిరెక్టర్ల తో పాటు మా పార్టీ కి చెందిన మహిళా విభాగం, యువజన విభాగం, మైనారిటీ విభాగం, విద్యార్ధి విభాగం తో సహా సికింద్రాబాద్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనేల చర్యలు తీసుకున్నామని మంత్రి పద్మారావు గౌడ్ వివరించారు. సీఎం కెసిఆర్ ఆలోచన మేరకు చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం సికింద్రాబాద్ నియోజకవర్గం లోని ప్రతి పేద వ్యక్తికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com