ఈ ఏడాది మహేష్ మూడు సినిమాలు

0

mahesh-babu-apudnia2017లో తాను మూడు సినిమాల్లో నటించబోతున్నట్లు మహేశ్‌ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం సిట్జర్లాండ్‌లోని హాలీడేస్‌లో ఉన్న మహేష్‌బాబు తాను చేయబోయే సినిమాల వివరాలను ట్విట్టర్‌లో ద్వారా వెల్లడించాడు. మురగదాస్‌ దర్శకత్వంలో పోలీస్‌ ఆఫీసర్‌గా కన్పించే పాత్రలో ‘సంభవామి’ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. మొన్న కొరటాల శివతో రెండో సినిమా ప్రారంభమైంది. దానికి ‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ కూడా అనుకుంటున్నారు. కొరటాలతో చేసే రెండో సినిమా ఇది. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్టు మహేష్‌ చెప్పాడు. దిల్‌ రాజు, అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదటసారి ఈ కాంబినేషన్‌లో రూపొందుతోంది. ఇప్పుడు మళ్లీ మరోమారు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ ప్రిన్‌‌స సినిమా తీయబోతున్నాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందనుందని ప్రిన్‌‌స చెప్పాడు. గతంలో అతడు, ఖలేజా సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చినవే. మురుగదాస్‌ సినిమా దాదాపు పూర్తవడంతో దాన్ని పక్కనపెడితే కొరటాల, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్‌ ల సినిమాలు మూడు ఈ ఏడాది మహేశ్‌ ను ప్రేక్షకుల ముందుకు తేనున్నాయన్న మాట.

Share.

Comments are closed.