ప్రేమను తిరస్కరించిందని మిద్దెపై నుంచి దూకేశాడు

0

suicide-apduniaనేటి యువతకు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండడం లేదు. క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని తమను తాము శిక్షించుకోవడమే గాక తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాదులో బుధవారం జరిగింది. ముత్యంచారి అనే న్యాయవాది హయత్ నగర్ శ్రీనివాస కాలనీలో ఒక అపార్టుమెంట్ లో నివాసముంటున్నారు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు శివశంకర బ్రహ్మ(28) ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, బీఈడీ చేశాడు. ప్రస్తుతం పిల్లలకు ట్యూషన్ చెప్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తున్నాడు. బ్రహ్మ తన ఇంటికి సమీపంలో ఉండే ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి బ్రహ్మ ప్రేమను తిరస్కరించడంతో అతను తట్టుకోలేకపోయాడు. బుధవారం మధ్యాహ్నం అమీర్ పేట నుంచి ఇంటికి వచ్చిన అతడు తల్లి భోజనం చేయమన్నా ఆకలి లేదని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. తర్వాత ఐదు లీటర్ల కిరోసిన్ డబ్బా తీసుకుని తాను ఉంటున్న నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కాడు. అక్కడ ఎవరితోనో కొంచెంసేపు ఫోన్లో మాట్లాడి 3:30 గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ మంటలకు తాళలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.