మోక్షజ్ఞకు లైన్ క్లియర్

0
mokshagna-apduniaబాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం తమ బ్యానర్‌లో తీయబోతున్నట్లు ప్రకటించేశారు కొర్రపాటి సాయి. ఇప్పటికే ఆ అంశంపై ఆయన తన హామీ ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. దీంతో ఒక్కసారి అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఎటువంటి సబ్జెక్ట్‌ ఎంచుకున్నారు.. తొలి సినిమాతో మోక్షజ్ఞని ఏ విధంగా చూపబోతున్నారు అనే అంశాలను వివరించలేదు.. ఒకవైపు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర విడుదల సంబరాల్లో ఉన్న నందమూరి అభిమానుకుల మోక్షజ్ఞ ఎంట్రీ తీపు కబురనే చెప్పాలి.. తొలిచిత్రం చేయడం ఒక మైలురాయిగా భావిస్తున్నామని… ఆరోజు ఎప్పుడు వస్తుందా అని తాను ఆతృతగా  ఎదురుచూస్తున్నాట్లు సాయి పేర్కొన్నారు. మరో వైపు బాలయ్యని పొగడ్తలతో ముంచెత్తేశారు.. తండ్రి ఎన్టీఆర్‌లా ముక్కుసూటితనం,కల్మషం లేకుండా వుంటారన్నారు. నిజాయితీకి మారుపేరు ఉంటారని.. ఆయనతో 2013 నుంచి తనకు మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ హీరోల జాబితా పెరగబోతుందన్నది మాత్రం క్లియర్. 
Share.

Comments are closed.