సాగర్ కు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో చాలా కాలం తర్వాత సాగర్ జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆదివారం 6 గేట్లు ఎత్తి 2.65 లక్షల క్యూ సెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. అల్ప పీడనం, రుతు పవనాల చురుకైన కదలిక ప్రభావంగా కారణంగా ఉత్తర తెలంగాణలో గడిచిన 20 రోజులుగా భారీగా వర్షాలు కొనసాగుతున్నాయి.జిల్లావ్యాప్తంగా వర్ష కురవడంతో ప్రజలు ఇబ్బందికి లోనయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు, ఆట విడపు కోసం బయటకు వెళ్లేందుకు అవకాశం లేక జనాలు ఇంటికే పరిమితమయ్యారు. శ్రావణ మాసం నేపథ్యంలో గ్రామాల్లో బోనాల వేడుకల నిర్వహణకు ఇబ్బందు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉదయం ముసురుతో ప్రారంభమై సాయంత్రానికి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు జలమయం కాగా శివాజీనగర్, హైదరాబాద్‌రోడ్డు, బీటీఎస్, క్లాక్‌టవర్ సెంటర్‌లో వరద పొటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వీరామంగా ముసురు కురిసింది. మునుగోడు నియోజక వర్గంలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. నకిరేకల్ నియోజక వర్గంలోని కట్టంగూర్‌లోని భారీ వర్షం పడగా మిగిలిన ప్రాంతాల్లో మోస్తరుగా ఉంది. సాగర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురవగా మిర్యాలగూడ పట్టణంలో మోస్తరు వర్షం పడటంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. శ్రీశైలంకు చేరుతున్న ఇన్‌ఫ్లో 2.90 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వరకు నీరు చేరింది. 215.8 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థానికి గాను ఇప్పుడు 200 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది.నాగార్జునసాగర్‌కు 2.35 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతోంది. 590 అడుగుల్లో 312 టిఎంసిల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 540 అడుగులకు చేరువగా ఉంది. 190 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత ఫ్లో కొనసాగితే వారం రోజుల్లో సాగర్ నిండే అవకాశం ఉంది. ఇంకా 125 టిఎంసిల నీరొస్తే సాగర్ గేట్లు ఎత్తా ల్సి వస్తుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు 1.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 76 వేల క్యూసెక్కు లు దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్‌లో ఉజ్జయి ని రిజర్వాయర్‌కు 25 టిఎంసిలు, నాగార్జునసాగర్‌కు 125 టిఎంసిలు, పులిచింతలకు 44 టిఎంసిల ప్రవా హం వచ్చి చేరితే బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ పూర్తిస్థాయిలో నిండినట్లే. కర్ణాటకలో ఇంకా వర్షం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్‌లో ఎల్లంపల్లికి 29,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 21800 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com