అద్వానంగా తెలంగాణ యూనివర్సిటిలు : బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి

గవర్నర్ అధ్యక్షతన అన్ని యూనివర్సిటీల విసీల సమావేశంలో గవర్నర్ ఏం చూసి సంతృప్తి వ్యక్తంచేశారో గవర్నర్ కార్యాలయం చెప్పాలని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ లలో అనేక పోస్టు ఖాళీలు ఉన్నాయి. 70 శాతం పోస్టు లు యూనివర్సిటీ లలో ఖాళీలు ఉన్నాయి. గవర్నర్ ఏం చూసి సంతృప్తి వ్యక్తం చేసారో చెప్పాలి. యూనివర్సిటీ లలో మెస్ లు ఎక్కడ ఓపెన్ కాలేదు. హాస్టల్ లలో పరిస్థితి అధ్వానంగా వుంది. విద్యార్థుల హక్కులపై గవర్నర్ కు బాధ్యత ఉంది. యూనివర్సిటీలపై గవర్నర్ అసలు సంతృప్తి వ్యక్తం చేశారా లేదా ఉపముఖ్యమంత్రి చెప్పాలని అయన అన్నారు. తెలంగాణ వచ్చాకా యూనివర్సిటీ లలో పరిస్థితి ఘోరంగా మారింది. ఓయూలో ఒక్క ప్రొఫెసర్ లేని డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. యూనివర్సిటీ లలో ఎక్కడ కూడా పరిస్థితి మారలేదు. యూనివర్సిటీ లకు నిధులను వెంటనే కేటాయించాలి. గవర్నర్ ఏం చూసి మెచ్చుకున్నారో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com