మోడీపై మళ్లీ కేజ్రీ సెటైర్లు

0

kejriwal-modi-apduniaపంజాబ్‌ ఎన్నికల రణరంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో, పంజాబ్‌ ఎన్నికల బరిలోకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్‌ దిగబోతున్నారా? అనే చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో మొదలైంది. అయితే, మనీష్‌ శిసోడియా మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉందన్న విషయంలో క్లారిటీ లేదు. ఆప్‌ నుంచి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్‌ లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయన ఓ ట్వీటు చేస్తూ ఉదయం యోగా చేయడం మానేశానని, తన తల్లి హీరాబెన్‌ ను కలిసేందుకు వెళ్లానని, ఆమెతో కలసి టిఫిన్‌ చేశానని పేర్కొన్నారు. అయితే, ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలిపిన మోదీపై అదే ట్విట్టర్‌ ద్వారా కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. తన తల్లి మాత్రం తనతోనే ఉంటుందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాను ప్రతిరోజు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటానని, అసలు హిందూ మత గ్రంథాల ప్రకారం తల్లి, భార్యను ప్రతి వ్యక్తి తనతోనే ఉండనివ్వాలని హితబోధ చేశారు.ప్రస్తుతం మోదీ ఇల్లు చాలా పెద్దదిగా ఉందని, కనీసం ఇప్పుడయినా ఆయన తనతల్లిని తన దగ్గరే ఉండేలా చూసుకోవచ్చుగా అని ట్వీట్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ తన తల్లిని వాడుకుంటున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని రోజుల క్రితం మోదీ తన తల్లిని బ్యాంకు క్యూలో నిలబెట్టారని కూడా ఆయన ఆమధ్య ట్వీటు చేశారు.

Share.

Comments are closed.