గెలుపు గుర్రాల కోసం కేసీఆర్ కసరత్తు

ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న సమయానికంటే ముందే ఎన్నికలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది. మిగతా పార్టీల సంగతి పక్కనపెడితే, అధికార పార్టీలో మాత్రం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించిన ఆయన.. ఇటీవల తుది జాబితాను నిర్ణయించేందుకు ప్రజా స్పందనపైనే ఆధారపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం గులాబీ బాస్ మరోసారి సర్వే నిర్వహించారని, త్వరలోనే ఫైనల్ లిస్టును రూపొందించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పనితీరు పట్ల అక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, దీంతో సదరు ప్రజాప్రతినిధులకు సీఎం వార్నింగ్ ఇచ్చారని టాక్ వినిపించింది. అంతేకాదు, ప్రజల్లో అసంతృప్తి ఉన్న సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ తేల్చేయడం.. ముందుస్తు అని సుఛాయగా తేలడంతో టీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు హైదరాబాద్‌కు క్యూ కట్టారు.దీనికి తోడు వచ్చే నెలలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామని కేసీఆర్ ఇటీవల చెప్పడంతో, ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కొందరు టీఆర్ఎస్ భవన్‌లోనూ, మరికొందరు ప్రగతి భవన్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు పార్టీ తరపున టికెట్ ఆశించే వారు స్పీడు పెంచారు. ఆశావహులు మాత్రం అవకాశం రాకపోతుందా అనే ధీమాతో తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసేందుకు పలువురు ఇప్పటికే పలువురు రాజధాని బాట పట్టారు. వారిలో కొందరు మంత్రులు హరీశ్, కేటీఆర్‌ను కాకా పడుతుండగా, మరికొందరు గులాబీ బాస్‌తోనే డీల్స్ మాట్లాడుకుంటున్నారని వినికిడి. ఇలాంటి నేపథ్యంలో ఓ వార్త బయటికి వచ్చింది. కేసీఆర్ ఇటీవల చేసిన సర్వేలో 40 మందిలో కొంతమందికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఫలితాలను మెరుగుపరుచుకోని దాదాపు 20 మంది ఎమ్మెల్యేకు ఈ సారి మొండిచేయి చూపాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో టికెట్ ఆశించే వారు మాత్రం తమకు మంచే జరిగిందని అనుకుంటున్నారట, ఇక నుంచి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com