ఉద్యమ సింహం బయోపిక్ ఫస్ట్ లుక్

0

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిందనీ, ఈ నెల 16న సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఉద్యమ సింహం’ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

Share.

About Author

Leave A Reply