కార్తీక మాస విశిష్టత

0

స్కందపురాణం లో కార్తీక మాసం గొప్పదనం గురించి బ్రహ్మగారు నారదుడికి చెప్తారు. కార్తీక మాసానికి మరొక పేరు దామోదర మాసం. ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. ఈ కార్తీక మాసంలో ఎవరు దామోదరుడుని(శ్రీకృష్ణ భగవాణుడు) ప్రతిరోజు అత్యంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ప్రతిరోజు నేతితో చేసిన దీపంతో లక్ష్మీనాధుడిని ఆరాధిస్తారో, హరినామ స్మరణ చేస్తుంటారో, అటువంటివారికి ఇప్పటివరకు వారిని జన్మజన్మల యందు వెంటాడుతున్న దారిద్యం నశించి, అపారమైన భోగభాగ్యాలను, సిరిసంపదలను అపారంగా వర్షించటమేకాక, ఉత్కృష్టమైన మోక్షాన్ని అనుగ్రహింపచేస్తాడు శ్రీమన్నారాయణుడు. కార్తీకమాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం. మార్గశీర్ష మాసం తర్వాత అంత గొప్ప నెల ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. దక్షణాయనంలో ఈ రెండు నెలలు పక్కపక్కనే వస్తాయి. ఈ రెండు నెలలో చేసే పూజలకు, దానాలకి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. అంత గొప్పదైన ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. అంటే తాడుచేత ఉదరమునకు (పొట్ట) కట్టబడిన కృష్ణుడు.కార్తీకమాసంలో ప్రతిరోజూ దామోదరలీలను, దామోదర అష్టకాన్ని పారాయణ చేయమంటారు పెద్ధలు. భాగవతంలో ఇది ఒక గొప్ప లీల. చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడని తల్లి యశోద, కృష్ణుడిని ఒకతాడుతో రోటికి కట్టాలని చూస్తుంది. కానీ తాడు సరిపోదు. మళ్ళీ కొంచెం పెద్ద తాడు కడుతుంది. అయినా సరిపోదు. ఆలా ఎంత తాడు తీసుకొచ్చిన అయన మాత్రం కట్టుబడట్లేదు. సమస్త బ్రహ్మాండాలు అయన కడుపులోనే ఉన్నాయని తెలియని ఆ గోపస్త్రీ అయన పరమాత్మ అన్న విషయం తెలియక ఆయన్ని కట్టేయాలని చూస్తుంది. చివరికి అమ్మ అవస్థని చూసిన భగవానుడు, ఆమె ప్రేమకి లొంగి ఒక రోటికి బంధింపబడ్డాడు. ఈ లీల జరుగుతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు, పార్వతీ సహితుడైన పరమశివుడు, 33 కోట్లమంది దేవతలు, ఋషులు ప్రచ్ఛన్న వేశాలలో నందుడి ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. ఈ కంటికి కనపడని పరమాత్మ, ఒక జాతకర్మ అంటే తెలియనివాడు, అండ, పిండ, బ్రహ్మాండాలను సృష్టించిన పరాత్పరుడు భక్తికి లొంగి ఒక ప్రాకృత బాలుడు వలె అమ్మకి బయపడుతున్నవాడిలా నటిస్తున్న కృష్ణపరమాత్మని ఒక రోటికి బంధించింది. వేదాలకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, యోగుల మనస్సులకు దొరకనివాడు, ఈరోజు తల్లిప్రేమకు బంధీ అయ్యాడని, లోకంలో ఎవ్వరికీ ఇటువంటి వరాన్ని ఇవ్వనివాడు కేవలం ఈ గోపాలవనితకి ఇచ్చాడని దేవతలంతా ముక్కున వేలేసుకున్నారు.

Share.

About Author

Leave A Reply