కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసం

0

ఈ మాసంలో ఎంత భక్తిశ్రద్దలతో పూజలు చేస్తామో అంత మంచి ఫలితం ఉంటుంది. కార్తీకమాసంలో సూర్యోదయానికి మందే తలకు స్నానం చెయ్యాలి. చల్లటి నీటితో చెయ్యాలి. అలాగే తలకు నూనె రాసుకుని, తర్వాత తలకు స్నానం చేస్తారు చాలా మంది. అలా తలకు నూనె పెట్టకుండా ఉంటె మంచిదని అంటారు. కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యమైనా పని. అయితే ఆ దీపంలో ఒక వత్తు వేయకూడదు. దీపంలో 2 వత్తులు వేయాలి. ఈ మాసంలో మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే ఈ మాసంలో మద్యపానం కూడా తీసుకోకూడదు. ఈ మాసంలో అబద్దాలు ఆడటం, ఎదుటివారిని బాధ పెట్టడం, మోసాలు ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటివి ఏ మాసంలో అయినా చేయకూడదు. కార్తీకమాసంలో అస్సలు చేయకూడదు. ఇక ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో మద్యాహ్నం వేల అస్సలు పడుకోకూడదు. అలా గాని పడుకుంటే శివకేశవులకు కోపం వస్తుందంట. ఈ మాసంలో మద్యాహ్నం గాని పడుకుంటే తీరని కష్టాలు వస్తాయని అంటారు..

Share.

About Author

Leave A Reply