కాపులు ఓటు బ్యాంకులు కారు : కాపు జెఎసి ఛైర్మన్ సత్యనారాయణ

కాపు రిజర్వేషన్ల పై వారం రోజులుగా ఎపి లో విస్తృత చర్చ సాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా ప్రకటనలు చేసుకుంటూ ప్రజల్లో గందరగోళంలోకి నెడుతున్నారని కాపు జెఎసి ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో బలిజలకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్, మ్యానిఫెస్టోలో పెట్టారు. ద్వంద్వ వైఖరితో ఎన్నికలకు వెళ్లిన జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. చంద్రబాబు ను ఎవరూ అడగకపోయినా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ నాలుగేళ్లల్లో ఏదో ఒక సాకుతో కాలయాపన చేశారని అన్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం వ్యత్యాసం తో గెలిచిన విషయాన్ని బాబు గుర్తుంచుకోవాలి. జగన్..కేంద్రం పరిధిలో ఉందని యూ టర్న్ తీసుకుని కాపులను మోసం చేశారు. చంద్రబాబు, జగన్ లు కాపులను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారని అయన విమర్శించారు. సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాట కూడదని చెప్పిన మాట వాస్తవం. కానీ తర్వాత మార్చేలా పార్లమెంటు లో చట్టం చేసే అవకాశం ఉన్నా ఆదిశగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదని అయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు అంశం ఈనాటిది కాదనేది పాలకులు గుర్తించాలి. చంద్రబాబు, జగన్ ల మాటలు కాపులపక్షాన తేనెలాగా… ఉన్నా.. వ్యవహారశైలి మాత్రం కత్తి లాగా పదనుగా ఉంటుందని అన్నారు. కాపుల విషయంలో ఆధునిక పగటి వేషాలు మానుకోవాలి. యాభై శాతం రిజర్వేషన్ అనేది అసలు అడ్డంకే కాదు.. కానీ చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని అన్నారు. ఎవరు సాధ్యంకాదని చెప్పారో దమ్ముంటే మాతో చర్చకు రండి. ఇక ఏపార్టి నేతలు కూడా యూ టర్న్ లు కాకుండా…రైట్ టర్న్ లు తీసుకోవాలని అన్నారు. ముస్లింల కు ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ఆవిధంగానే జీవో 30ని అమలు చేయాలి. ఆగష్టు 24వ తేదీ లోపు స్పష్టమైన వైఖరిని బాబు ప్రకటించకపోతే మా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *