అట్టహాసంగా కాకినాడ బీచ్ ఫెస్టివల్

0

kakinada-beach-festival-apduniaబీచ్ ఫెస్టివల్ కు ఏపీలోని సాగర తీర నగరం కాకినాడ సిద్దమైంది. ఈరోజు నుంచి 15 వరకు సాగర సంబరాలు అలరించనున్నాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో గతానికి భిన్నంగా అధికార యంత్రాంగం బీచ్ పండుగ ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటక ప్రపంచ పటంపై గుర్తింపు కోసం ఈ కార్యక్రమాన్ని వినియోగించకోనుంది.

కాకినాడ సాగర సంబరాలను ఈసారి ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాకినాడకు మణిహారమైన హోప్ఐలాండ్ను రాత్రిపూట సందర్శించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ దగ్గర ఉన్న కోరింగ అభయారణ్యంలో ఆహ్లాదంగా గడపటానికి చర్యలు చేపట్టారు. కాకినాడ బీచ్తో పాటు హోప్ఐలాండ్, కోరింగ మడఅడవులను అనుసంధానం చేసి సాగర సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించటానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకంగా ప్రోత్సాహానికి సంబరాలను వేదికగా చేసుకుంటున్నారు అధికారులు.

ఈ సాయంత్రం 5 గంటలకు కాకినాడలోని జగన్నాధపురం వంతెన వద్ద జట్టీ నుంచి బోటులో హోప్ఐలాండ్ సందర్శనకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు రాత్రి అంతా అక్కడే గడిపి అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు వెనుదిరుగుతారు. తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో జగన్నాథపురం చేరుకుంటారు. ఈ సందర్బంగా చిన్నారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. 10 సంవత్సరాల లోపు వారిని ఉచితంగా తీసుకెళ్లనున్నారు.

హోప్ఐలాండ్కు సముద్రం నుంచి ఆలివ్రిడ్లే తాబేళ్లు రాత్రిపూట గుడ్లు పెట్టడానికి వస్తాయి. ఆ దృశ్యాలను చూసేందుకు సాధారణంగా అనుమతించరు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా పర్యాటకులకు అవకాశం కల్పించారు. హోప్ఐలాండ్కు బోటులో వచ్చేవారు ఆలివ్రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే అరుదైన దృశ్యాలు చూడొచ్చు. ఇదేవిధంగా కోరింగ అభయాణ్యంలో సుసంపన్నమైన వృక్ష, పక్షుజాతులతో అద్భుతమైన అందాలను ఆస్వాదించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ కూడా పర్యటించటానికి చర్యలు చేపట్టారు. మడ అడవుల సందర్శనకు 10 రూపాయలు టికెట్ ఖరారు చేశారు. 50 రూపాయలతో బోటు షికారు కూడా చేయొచ్చు.

Share.

Comments are closed.