కాజల్ ఖాతాలో మరో ఛాన్స్

0
kajal-agarwal-apduniaఖైదీ నం150’తో భారీ విజయం దక్కించుకున్న అందాల కాజల్ మరో భారీ ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటింటేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తుపాకి, జిల్లా సినిమాల తర్వాత ఆమె మరోసారి ‘భైరవ’ స్టార్ తో జోడీ కడుతోంది. ఇప్పటికే అజిత్ నటిస్తున్న తాను తాజాగా విజయ్ తోనూ పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది కాజల్. పదేళ్ల క్రితం చిత్రసీమకు తనను పరిచయం చేసిన దర్శకుడు తేజ ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు తెలిపింది. 
 
ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నటించడం, తమ చిత్రం ఘన విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసింది కాజల్. “చిరంజీవి గారితో నటించే అవకాశాన్ని మిస్ చేసుకోవాలని అనుకోలేదు. అది సత్ఫలితాన్నిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అని వ్యాఖ్యానించిందీ ముద్దుగుమ్మ. ఇక చిరుతో డ్యాన్స్ చేయడంపైనా ఈ సొగసరి తన అనుభవాన్ని వివరించింది. “చిరంజీవితో డ్యాన్స్ చేయడం చాలా హుషారుగా అనిపించింది. మేము చేసిన అమ్మడు-కుమ్ముడు పాట పెద్ద హిట్ అయింది. ఈ పాటలో చిరుతో పాటూ రామ్ చరణ్ తోనూ డ్యాన్స్ చేయడం నాకు ‘కజరారే’ పాటలా అనిపించింది” అని చెప్పుకొచ్చిందీ సొగసరి. 
Share.

Comments are closed.