ఎన్నికయిన పదవికి న్యాయం చేయాలి

వర్నీ మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ విరమణ సన్మాన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలోనే రైతుబంధు జీవిత బీమా దృవీకరణ పత్రాల పంపిణీ జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. అయన మాట్లాడుతూ చిన్న పంచాయతీలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందనే ఉద్యేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 4,333 పంచాయితీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ కి తప్పనిసరిగా సెక్రటరీ ఉండాలని నూతనంగా 9350 మందిని నియమించబోతున్నాం. శ్రీనగర్ పంచాయతీ రూ. 10 కోట్లతో అభివృద్ధి చేశాంమని అన్నారు. శ్రీనగర్ పంచాయతీ అభివృద్ధి కి కృషి చేసిన సర్పంచ్ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు ను అభినందించారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికయి, ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం. ఎన్నికయిన పదవికి న్యాయం చేయాలి. వచ్చే యాసంగిలో రైతుబంధు పథకం కోసం రూ. 5960 కోట్ల విడుదలకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. నవంబర్ 18 నుండి రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభిస్తాం. కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల పడకూడదనే మంచి ఉద్యేశంతో రాష్ట్రంలో రైతుబంధు జీవిత బీమా అమలు చేస్తున్నాం. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 2,271 చొప్పున మొత్తం 636 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థకు చెల్లించడం జరిగింది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులు బీమా కు అర్హులు. అగస్టు 14 రాత్రి నుండి రైతుబంధు జీవితబీమా అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది అగస్టు 13 వరకు వర్తిస్తుంది. కుటుంబానికి ఆదారమైన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ కుటుంబానికి ఆసరాగా రూ. 5 లక్షల బీమా అందుతుంది. రైతు చనిపోయిన పది రోజులలోనే నామినీకి రూ. 5 లక్షల చెక్కు అందుతుంది. ఈ రూ. 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా 8 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 40,000 లభిస్తుందని మంత్రిఅన్నారు. కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఈ డబ్బులతో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బతుకుతుంది. రైతుబంధు పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తాం.ఇప్పటికే వెరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *