దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 15 నుంచి జియో గిగా ఫైబ‌ర్ సేవ‌లు

టెలికాం వినియోగ‌దారులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబ‌ర్, జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల తేదీని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వెల్ల‌డించింది. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు వీటి గురించిన ప్ర‌క‌ట‌న చేశారు. ముంబ‌యిలో జ‌రుగుతున్న ఆర్‌ఐఎల్ 41వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఈ సేవ‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువడింది. ఆగ‌స్టు 15 నుంచి దేశ‌వ్యాప్తంగా జియోగిగా ఫైబ‌ర్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. జియో గిగా ఫైబ‌ర్ కోసం మై జియో, జియో.కామ్ వెబ్‌సైట్లో రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చు.

దాదాపు 1100 న‌గ‌రాల్లో అత్యాధునిక‌, ఫైబ‌ర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు. గ‌త కొన్ని నెల‌లుగా ఎంపిక చేసిన న‌గరాల్లో జియో ఫైబ‌ర్ బీటా సేవ‌ల టెస్టింగ్ జ‌రిగింది. ఇక‌పై జియో ఫైబ‌ర్ సేవ‌లు ఇళ్ల‌కు, వ్యాపార‌స్థుల‌కు, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి.
జియో గిగా ఫైబ‌ర్లో అందుబాటులో ఉండే రెండు ముఖ్య ఫీచ‌ర్లు స్మార్ట్ హోం టెక్నాల‌జీ, టీవీ కాలింగ్. సెట్‌టాప్ బాక్స్ ద్వారా టీవీలో సైతం జియోగిగా ఫైబ‌ర్ సేవ‌లు వాడుకోవ‌చ్చు. జియో ఫోన్లో సైతం ఈ అడ్వాన్స్ ఫీచ‌ర్లు ఉంటాయి.

ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, ఆర్‌ఐఎల్ ప్ర‌తినిధి కిర‌ణ్ ఈ స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను ఎలా వినియోగించుకోవ‌చ్చు అనే దానిని ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న ద్వారా చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com