మోదీ ఫ్యాక్షనిస్టుగా మారారు: జేసీ

0

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేరు ఆ పార్టీలో ఒక సంచలనం అని చెప్పాలి.ఆయనకీ మైక్ చేతికి ఇస్తే అవతలి వారు ఎంతటి స్థాయి వ్యక్తి అయినా సరే ఐ డోంట్ కేర్ అంటారు.ఆయన ఏ స్థాయిలో ప్రశంసలు కురిపిస్తారో అంతే స్థాయిలో విమర్శలు కూడా చేస్తారు.ఇప్పుడు కూడా తాజాగా జేసీ దివాకర్ రెడ్డి మరో సారి ఆయన నోటికి పని చెప్పారు.దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద జేసీ ఈ రోజు విరుచుకుపడ్డారు.నరేంద్రమోడీ ఎప్పుడైతే ప్రధాన మంత్రి అయ్యాడో అప్పటి నుంచి ఆయన ప్రజా సంక్షేమ దృష్ట్యా చాలా మార్పులు తెచ్చుకుని ఒక ఫ్యాక్షనిస్ట్ లా తయారయ్యాడని సంచలన వ్యాక్ష్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలను కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.అంతే కాకుండా ఎవరైనా ఏవైనా తప్పులు చేస్తే వాటిని సరి చెయ్యాలే కానీ,తానొక్కడే బాగుండాలి మిగతా వారి అందరిని అణగదొక్కాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో నరేంద్ర మోడీ భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.అంతే కాకుండా వెనుకబడినటువంటి జిల్లాలను బాగు చెయ్యడానికి 350 కోట్లు విడుదల చేసి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకున్న ఘనుడు,మొనగాడు,దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ దేశ చరిత్రలోనే ఒక్క నరేంద్ర మోడీ తప్ప ఇంకెవ్వరు లేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Share.

About Author

Leave A Reply