జగన్ పై జేసీ సెటైర్లు

0

jc diwakar_jagan_apduniaఅనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై సెటైర్లు వేశారు. బుధవారం పైడిపాలెం ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ ప్రసంగిస్తూ వయసులో చిన్నవాడు.. చిన్నప్పటి నుంచి చూసినవాడు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా ‘వాడు’ అని జగన్‌ను సంబోధించాను తప్ప పొగరుతో కాదన్నారు. తాను అలా పిలవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. అందుకే ఇక నుంచి జగన్‌ను ‘వాడు’ అని సంబోధించనని, ‘శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు’ అని సంబోధిస్తానని జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ చిన్నవాడనుకున్న కానీ ఆయన పెద్దవాడయ్యాడరన్నారు. బుద్ధి ఉన్నవారెవరైనా సీమకు ఉపయోగపడే పట్టిసీమను వద్దంటారా? అంటూ జేసీ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన తాత గుణాలు వచ్చాయని విమర్శలు గుప్పించారు. 7వ తరగతి ఫెయిలైన వాడిని తాడిపత్రి ఇన్‌చార్జ్‌గా పెట్టారని ఎద్దేవా చేశారు. కులం, వర్గంతో పెట్టుకుంటే లాభం లేదని జగన్‌కు జేసీ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన జేసీ తాను బూట్లు నాకేవాడిని అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అన్నారు. ‘శ్రీకాంత్ రెడ్డి నన్ను జానీవాకర్‌ అంటావా? నాకు తాగే అలవాటు లేదు.. సారా మా ఇంటావంట లేదు… తాగే అలవాటు వాళ్లకే ఉంది. నా నాలుక చీలుస్తావా? అంత మగాడివా?’ అని జేసీ ధ్వజమెత్తారు.

Share.

Comments are closed.