అశ్లీల వెబ్‌సైట్లను అతిగా చూస్తు న్న దేశాల్లో భారత్‌ది మూడోస్థానం

0

-పెరుగుతున్న రేప్‌లకు కారణం ఈ సైట్లేనట!

చిన్నా, పెద్దా, తేడా లేదు.. మదోన్మాదులు స్వైరవిహారం చేస్తూనే ఉన్నారు. కన్ను తెరి స్తే అత్యాచారం.. కళ్లు మూస్తే అఘాయిత్యం. దేశంలో పెచ్చరిల్లిపోతున్న లైంగిక దాడులకు అసలు కారణమేంటి? స్త్రీ-పురుష నిష్పత్తిలో తేడాలా? సామాజికంగా వస్తున్న మార్పులా? సినిమాలా?పేపర్లా? ఇవేవీకాదు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బూతు వెబ్‌సైట్లు, అశ్లీలమైన కంటెంట్‌తో కూడిన యూట్యూబ్‌ చానెళ్లు, శరపరంపరగా వస్తున్న నీలిచిత్రాలహోరు.. అని అనేక అధ్యయనాలు తేల్చాయి. బూతు చిత్రాల సైట్లను కేంద్రం కొంతమేర నియంత్రించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఉత్తర్వు మేరకు టెలికమ్యూనికేషన్స్‌ శాఖ 827 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసింది. అయినా ఆగితేనా? గూగుల్‌లోకి వెళ్లి సెర్చి చేసి మరీ ఆ వెబ్‌సైట్లను చూస్తూ రెచ్చిపోతున్న కుర్రకారు ఎందరో! గూగుల్‌ కూడా తన వంతుగా నీలి సైట్లకు సంబంధించి కొన్నిసూచిక పదాల(కీ వర్డ్స్‌)ను అల్గారిథమ్‌లో నియంత్రించింది. సగం కంటే ఎక్కువ కేసుల్లో- లైంగిక దాడులకు కారణం పోర్న్‌ సైట్లేనని ఒక విశ్లేషణలో తేలింది. ‘‘పోర్న్‌ అనేది థియరీ.. లైంగిక దాడి అనేది ప్రాక్టికల్‌’’ అని రాబిన్‌ మోర్గాన్‌ అనే అమెరికన్‌ రచయిత్రి, అతివాద ఫెమినిస్టు వ్యాఖ్యానించారు. ‘తీవ్రమైన శారీరక బలంతో ‘ఆక్రమణ’ పోర్న్‌లో కనిపిస్తుంది.. అదే రేప్‌లోనూ ప్రతిబింబిస్తుంది’ అని ఓ శాస్త్రీయ అధ్యయనమూ తేల్చింది. పోర్న్‌ వెబ్‌సైట్ల నియంత్రణ వల్ల అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సైట్ల నిషేధాన్ని అనేకమంది వ్యతిరేకించినా- సామాజిక మార్పు రావడానికి దోహదపడే చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని భావిస్తోంది.అత్యాచార ఘటనలకు ఊతమిచ్చిన మరో కారణం స్మార్ట్‌ఫోన్‌ విప్లవం. కొత్త కంపెనీలు పుట్టు కొచ్చి చౌక ధరకు ఫోన్లు, ఇంటర్నెట్‌, డాటా అందించడం, పోటీలు పడి ప్రజలను, యువతను ఆకర్షించే యత్నం చేయడం! అరచేతిలో చిన్న ఫోన్‌ ఉంటే.. ప్రపంచంలోని అశ్లీలమంతా మన కళ్లెదుట ఉన్నట్లే! ఒక అధ్యయనం ప్రకారం చేతిలో 2జీ లేదా 3జీ-ఎనేబుల్డ్‌ ఫోన్‌ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు పోర్న్‌ సైట్ల ను దర్శిస్తున్నారు. వారిలో అనేకులు లైంగిక దాడుల కు, లైంగిక వేధింపులకు, మహిళలను కవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లను అతిగా చూస్తు న్న దేశాల్లో భారత్‌ది మూడోస్థానం. అమెరికా, బ్రిటన్‌ తరువాతి స్థానం మనదే. ‘పోర్న్‌ హబ్‌’ వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ షేరు నాలుగేళ్లలో 121 శాతం పెరిగింది.

Share.

About Author

Leave A Reply