స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి బహుమతి తీసుకుంటూ సొమ్మసిల్లి విద్యార్ధిని మృతి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్పృహ తప్పి పడిపోయిన విద్యార్ధిని ఆస్పత్రికి తరలింపు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది.7వ తరగతి చదువుతున్న భవ్య స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందింది. ఇవాళ పాఠశాలలో జెండా వందనం అనంతరం బహుమతి తీసుకుంటూ సొమ్మసిల్లి పడిపోయి…అక్కడికక్కడే మృతి చెందింది. భవ్య గత కొన్ని రోజులుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని మృతితో పాఠశాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద విపరీతమైన వేడి, ఉక్కపోతతో విద్యార్ధులు, సందర్శకులు విలవిల్లాడారు. ఓ విద్యార్ధిని స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్ ఢిల్లీలోని సర్వోదయ కన్య విద్యాలయలో ఏడో తరగతి చదువుతున్న ఫైజా.. సరిగ్గా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో స్పృహతప్పి పడిపోయింది. కొందరు విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ఓ స్ట్రెచర్‌లో ఆమెను అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి ఎన్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్టు భావిస్తున్నారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు కూడా సొమ్మసిల్లి పడిపోయారు. అయితే కొద్ది సేపటికే కోలుకున్న ఆయన చాలా సేపు నేలమీదనే కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com