పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.లక్ష్మణ్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ వచ్చిన తర్వాతనే బీసీ లకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందని తెలిపారు. 70 ఏళ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి మరింత పదును పెట్టి ఆ వర్గాల అభ్యున్నతి కి పెద్ద పీట వేశారని అన్నారు. బడుగుల హక్కుల కోసం పాటు పడుతున్న మోడీ అభినవ అంబేడ్కర్ అని లక్ష్మణ్ కొనియాడారు. వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్, తెరాస రెండు ఒక్కటేనని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్అని గుర్తు చేశారు. దేశన్ని అభివృద్ది పథంలో నడిపిండి కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాక్షను నేరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖునీ చేయబడుతోందని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ కు కోర్ట్ ఉల్లంఘన నోటీసులు వచ్చిన దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
మనోవైపు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎన్ .టి.ఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయాన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికార పార్టీ తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com