జిన్నా ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగేది కాదు బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూకు బదులుగా జిన్నాకు భారత ప్రధాని పదవిని అప్పగించి ఉంటే దేశ విభజన జరిగిఉండేదే కాదని వ్యాఖ్యానించారు. గోవా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో విద్యార్థులతో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘మహాత్మా గాంధీ భారత ప్రధాని పదవిని జిన్నాకు ఇవ్వాలనుకున్నారు. తద్వారా దేశ విభజనను ఆపాలనుకున్నారు. కానీ ఇందుకు నెహ్రూ అంగీకరించలేదు. ‘నేనే ప్రధాన మంత్రి కావాలి’ అని నెహ్రూ అనుకున్నారు. ఒకవేళ జిన్నాను ప్రధానిని చేసుంటే అసలు దేశం భారత్, పాకిస్తాన్ లుగా విడిపోయేదే కాదు. నెహ్రూ చాలా అనుభవమున్న వ్యక్తి. ఎంత అనుభవమున్నా కొన్నికొన్ని సార్లు తప్పులు జరిగిపోతుంటాయి’’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com