తిరుమల నిండుతున్న హుండీ

0

tirumala-hundi-apduniaఏడుకొండలవాడి హుండీ నిండి పోతుంది…పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా కరెన్సీ కి డిమాండ్ ఏర్పడినప్పటికీ తిరుమల శ్రీవారి హుండీ మాత్రం ఏరోజుకారోజు నిండుతూనే ఉంది..భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికి శ్రీవారి హుండీకి మాత్రం కనక వర్షం ఆగలేదు…సోమవారం ఒక్క రోజే సుమారు 4.18 కోట్ల రూపాయల ఆదాయం శ్రీవారి హుండీ ద్వారా టిటిడికి లభించింది..కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి సుమారు 36 కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హుండీ ద్వారానే లభించిందని టిటిడి అధికారులు చెప్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ను దర్శించుకునేందుకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు..వీరిలో పేద,ధనిక అనే తేడా లేకుండా స్వామివారి దర్శనం దొరికితే చాలు అనే భక్తులే అధికం..ప్రతి రోజు సుమారు యాబై నుంచి అరవై వేల భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుoటారు ..వారాంతపు రోజుల్లో అయితే ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది..ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు ప్రతి నిత్యం కోట్ల రూపాయల్లో ఉంటుంది..సాధారణ రోజుల్లో హుండీ ద్వారా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల వరకు వుంటుంది..ఇక వీకెండ్ లో అయితే సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా శ్రీనివాసునికి వస్తు ఉంటుంది..కానీ ఇటివల కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల పెద్ద నోట్లు రద్దు చేయడంతో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. వారాంతపు రోజుల్లో సైతం భక్తుల సంఖ్య యాబై వేలకు మించలేదు..దీంతో శ్రీవారి దర్శనం కేవలం రెండు నుంచి మూడు గంటల సమయం మాత్రమే పడుతున్నది..తిరుమల కొండ పై భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ హుండీ ద్వారా ప్రతి నిత్యం కోట్ల రూపాయలు ఆదాయం వస్తుండడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. సోమవారం ఒక్క రోజే సుమారు 4.18కోట్ల రూపాయలు ఆదాయం హుండీ ద్వారా టిటిడికి లభించింది. పెద్ద నోట్లు చెల్లక పోవటం తో అవి కాస్త శ్రీవారి హుండీ చేరుతున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ స్వామివారి హుండీ మాత్రం భారీ ఆదాయంతో కళకళలాడుతూ ఉంది. నల్లధనాన్ని వైట్ గా చేసుకోలేని నల్ల కుభేరులు ఇలా స్వామివారి హుండీలో వేస్తున్నారన్న అంచనాకు వస్తున్నారు టిటిడి అధికారులు..పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు హుండీ ద్వారా సుమారు 36 కోట్ల రూపాయలు వెంకన్న ఖజానా కు చేరింది.

Share.

Comments are closed.