డోన్ లో భారీ దొంగతనం

కర్నూల్ జిల్లా డోన్ పట్టణం చోరీలకు అడ్డాగా మారిపోయింది.వరుస దొంగతనాల తో పట్టణ వాసులు బెంబేలెత్తిపోతు న్నారు. బంగారు షాపు,కిరాణా షాపు,ఫ్యాన్సీ స్టోర్ చివరకు బీడీ సిగరేట్ బంకులను కూడా వదలడం లేదు.గత మూడు నెలల నుండి 30 దొంగతనాలు జరిగిన పోలీసులు ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా చేధించలేదు. తాజాగా డోన్ పట్టణ శివారు ప్రాంతం లో ఉన్న ఎం కె హోమ్ టౌన్ లో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త పాపి రెడ్డి తన కుటుంబంతో బంధువుల ఊరికి వెళ్లారు. తిరుగి ఇంటికి చేరగా తాళాలు , వాకిళ్ళు పగలగొట్టి ఉండటాన్ని చూసి బిత్తరపోయాడు. లోపలికి వెల్లి చూడటంతో బంగారు నగలు,డబ్బులు పెట్టిన బీరువా తెరిసి ఉండటం తో పోలీసులకు సమాచారం అందించాడు. బీరువా లో పెట్టిన 30 తులాల బంగారు ఆభరణాలు, మూడు లక్షల నగదు దొంగలు దోచుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ఇంట్లో ఇదివరకు కూడా దొంగతనం జరిగింది. ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, దాని తాలుకు హార్డ్ డిస్క్ ని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com