భక్తులతో బాసర కిటకిట

దక్షిణ భారత దేశంలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసర, శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. వరలక్ష్మీదేవి మంచి శుభ ముహూర్తం ఉండడం తో భక్తుల రద్దీ నిండుగా కనిపించింది. క్యులైన్లు భక్తులతో కిటకిట లాడాయి. తల్లి దండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పరబ్రహ్మ స్వరూపిణి సరస్వతీ అమ్మవారరు, విష్ణు స్వరూపిణి యైన లక్ష్మీ అమ్మవారి దర్శనము చేసుకున్నారు. పిల్లలకి మంచి చదువు, జ్ఞానాన్ని, బుద్దిని, మేధస్సును, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com