మనం చేసే పచ్చళ్ళు , స్వీట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే

0
pickels_apdunia-అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ వుండటం లేదా? వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్లో వుంచండి. 
-పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అందులో కొన్ని లవంగాలని వేయండి. 
చేప ముక్కల్ని నిల్వచేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు. 
-పాస్తా చేసేప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు. ఉడికిన తర్వాతనే వెయ్యాలి. 
స్వీట్స్ చేసేప్పుడు చక్కెరకు బదులుగా దానిని పొడిచేసి వేస్తే అవి ఇంకా రుచిగా వుంటాయి. 
 
-లంచ్ బాక్స్‌లు వాసన వేస్తున్నాయా? రెండు మూడు రోజులకొకసారి నిమ్మచెక్కతో రుద్ది కడగండి. 
-వాల్ నట్స్‌‍ను రాత్రంతా ఉప్పునీటిలో నానబెట్టి ఉదయాన పెంకును సులువుగా తీయొచ్చు. 
-కూరగాయలు తరిగేప్పుడు చేయి కాలినా/తెగినా అలోవెరా జెల్‌ను రాయండి. 
-కేక్ గుడ్డు వాసన వస్తూంటే… తయారు చేసేప్పుడు రెండు స్పూన్ల తేనె కలపండి. 
-అల్యూమినియం గిన్నెలో వండేప్పుడు గిన్నె మాడుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వెనిగర్ వేయండి. 
-గ్రేవీ, సూపులు చిక్కగా రావడం లేదా? అవి తయారు చేసేప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపండి. 
-నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి, కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతో తినండి.

 

 
Share.

Comments are closed.