సిర్పూర్ పేపర్ మిల్లుపై మళ్లీ ఆశలు

సిర్పూరు పేపర్‌ మిల్లు పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. 2014, సెప్టెంబర్‌ 27న మిల్లును యాజమాన్యం నష్టాల సాకుతో మూసివేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మిల్లు పునరుద్ధరణ కోసం స్థానికలు చేసిన ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. గతంలో జేకే మిల్లు ప్రతినిధులు, ఐటీసీ ప్రతినిధులు కూడా మిల్లును సందర్శించి వెళ్లారు. మిల్లు మూసివేతతో సుమారు ఐదు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి కరువైంది. ఇదే సమయంలో ఐడీబీఐ అధికారులు మిల్లుకు వచ్చి పలు ప్రాంతాల్లో నోటీసులు అంటించారు. మిల్లు ఆస్తులను తాము ఆధీనంలోకి తీసుకోనున్నట్టు నోటీసులు అంటిచండంతో మిల్లు పునరుద్ధరణపై అయోమయం నెలకొంది. మళ్లీ తాజాగా జర్మనీకి చెందిన పెప్సిల్‌ కంపెనీ ప్రతినిధులు కాగజ్‌నగర్‌కు వచ్చి మిల్లును సందర్శించారు. పెప్సిల్‌ మిల్లు ప్రతినిధితో పాటు ఒక సాంకేతిక బృందం మిల్లుకు వచ్చి మిల్లు పరిస్థితిపై సమీక్షించింది. మిల్లులోని యంత్ర సామాగ్రి పనితీరు, వాటి ప్రస్తుత పరిస్థితి, మిల్లు ఆస్తులపై పెప్సిల్ ప్రతినిధులు పూర్తిగా సమీక్షించనున్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా పెప్సిల్‌ యాజమాన్యం మిల్లు పునరుద్ధరణపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com