వైఎస్ జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్న హీరో జొన్నలగడ్డ హరికృష్ణ

జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జోన్నలగడ్డ హీరోగా పరిచయం చేస్తూ.. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ”ప్రేమెంత పని చేసే నారాయణ” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలిజ్ కి రెడీ అయ్యింది.. ఇటీవల వైస్సార్ సిపి అధినేత వైస్ జగన్ గారు ఈ చిత్రం అడియో ను రిలీజ్ చెయడం తెలిసిందే.అయితె ఇప్పుడు చిత్ర యూనిట్ ‘ఎదురు లేని మనిషి వైస్ జగన్ అన్న ‘ అనే సాంగ్ ను చేయడం జరిగింది. ఆ సాంగ్ ను హైదరాబాద్ లొ వైస్ జగన్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా… చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇటీవల విడుదల చేసిన మా ప్రెమెంత పని చేసే నారాయణ పాటలు మార్కెట్ లొ పెద్ద హిట్ అయ్యాయి.డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కుడా టాప్ ప్లేస్ లొ వున్నాయి. జగన్ గారి అభిమాని అయిన మా హీరో హరి కోరిక మేరకు ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే పాటను చెయడం జరిగింది.ఈ పాట ప్రతి వైస్సార్ గారి అభిమాని,జగన్ గారిని ప్రేమించే ప్రతి వ్యక్తికి నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఆ పాట సీడీలను జగన్ గారు ఆవిష్కరించి మా హీరో హరిని చిత్ర యూనిట్ ను అభినందించారు.సినిమాను ఈనెల 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.. ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని అన్నారు..
హీరో హరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారు విడుదల చెసిన మా సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యింది.ఆయన ఎంతో బిజీ బిజీగా వున్న కుడా ఆడియో ను విడుదల చేయటం నా జీవితం లొ మరచిపోలేని విషయం. జగన్ గారికి ఎంతో రుణపడి వున్నాను. ప్రజల కొసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకుడికి నా వంతుగా ఎదో ఒకటి చేయాలి అనుకొని ఆ ప్రజా నాయకుడి మీద ఒ సాంగ్ చెద్దమనే అలొచ్జన వచ్చింది. వెంటనే డాడీ కి చెప్పటంతో ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే టైటిల్ తో ఒక పాటను రుపొడించడం జరిగింది. మంచి క్వాలిటీ తో బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా మా టిం అంతా కృషి చేసింది. ఆ పాట సిడి ని జగన్ గారికి చూపించి అయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సినిమా మంచి విజయం సాధిస్తుంది.అల్ ది బెస్ట్ అన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది.. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నాను అని అన్నారు..
హరికృష్ణ జొన్నలగడ్డ, ( తొలిపరిచయం), అక్షిత, ఝాన్సి, చిలుకూరి గంగారావు, ఏఆర్ సి బాబు, రాహుల్ బొకాడియ, పింగ్ పాంగ్, రాఘవ పూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : జె ఎస్ ఆర్ మూవీస్, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, సంగీతం:యాజమాన్య, పాటలు: వనమాలి, గోసల రాంబాబు, ఎడిటర్: జానకీ రామ్, కో-డైరక్టర్ : వి.సిప్పి, కెమెరా: పి. ఎస్ వంశీ ప్రకాశ్, స్ట్రంట్స్: రామ సుంకర, కొరియోగ్రఫి:ప్రేమ్ రక్షిత్, విద్యా సాగర్, నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం:జొన్నల గడ్డ శ్రీనివాసరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com