వానపోటు

Indians hold on to each other as they cross a flooded street in the rain in Hyderabad, India, Friday, Sept. 16, 2016. Monsoon season in India begins in June and ends in October. (AP Photo/Mahesh Kumar A.)

కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎడతెరిపిలేని వానలతో సతమతమవుతోంది. వానల ఎఫెక్ట్ కు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పంటపొలాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. రవాణా సైతం ప్రభావితమైంది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో పాటూ కొన్నిచోట్లు రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. కొన్ని గ్రామాల్లో రహదారులను పునరుద్ధరించలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వానలు, వరదపోటు తగ్గినా ఇప్పటికే ఊళ్లల్లోకి చేరిన నీరు అలాగే నిలిచి ఉంది. ఈ నీరు ఇంకేందుకు చాలా రోజులే పడుతుందని స్థానికులు అంటున్నారు. మరోవైపు పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురవడంతో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఈ నష్టం నుంచి తేరుకోవాలంటే ప్రభుత్వమే అండగా ఉండాలని అంటున్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. రైతుల కష్టనష్టాలు మరోస్థాయిలో ఉన్నాయి. దీంతో అధికారులు బాధితులను పరామర్శిస్తూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇదిలాఉంటే కొన్నిరోజులుగా లోతట్టు ప్రాంతాల్లోని వారు అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంటున్నారు. బురద చేరడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సతమతమవుతున్నారు. వ్యాధులు విజృంభించే సీజన్ ఇదే కాబట్టి ప్రజల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతన్నల సమస్యలైతే తారస్థాయికి చేరాయి. శ్రమలకోర్చి వేసుకున్న పంటలు నీటి పాలవడంతో ఆవేదనలో కూరుకుపోయాయి. మొత్తంగా భారీ వర్షాలు అన్నదాతలకు గుండెకోతనే మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు వంకలు వంతెనలపై ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో వాటికి ఆనుకొని ఉన్న పంట పొలాలన్నీ నీట మునగడంతో పాటు ఇసుక మేటలు వేయడంతో భవిష్యత్తులోనూ రైతుల భూములు సాగుకు పనికి రాకుండా తయారయ్యాయని పలువురు అంటున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పలు పంటలూ ధ్వంసమయ్యాయి. దీంతో అన్నదాతలు కోలుకొని పరిస్థితి నెలకొంది. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టిన లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వమే నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com