భారీ వర్షాలు……నిండు గర్భిణీ అవస్థలు

గత రెండు రోజులుగా కురుస్తున్నా భారీ వర్షానికి అసిఫాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతుంది. రవాణా రాకపోకలు ఆగిపోయాయి. దహగం మండల పరిధిలోని గిరవెల్లి, గెర్రె గ్రామాల మధ్యన ఉన్న ఎర్రవాగు ఉప్పొంగి పొర్లుతుంది. దీనితో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిరవెల్లి కి చెందిన నిండు గర్భిణీ కి పురిటి నొప్పులు వచ్చాయి. ని ఎర్ర వాగు పై నిర్మిస్తున్న వంతెన పూర్తీ కాకపోవడం తో అసంపూర్తిగా ఉన్న వంతెన పై నుండి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెట్ల నుండి దహెగాం మండల పోలీసులు, గ్రామీణ చైతన్య సేవ సమితి యువకుల సహాయం తో అతి కష్టం మీద గర్భిణీ ని ను మంచంపై కూర్చో బెట్టి తాళ్ల సహాయంతో వంతెన దాటించారు. మహిళ కు హాస్పిటల్ వెళ్ళడానికి ప్రైవేట్ వాహనాలు, ,అంబులెన్సు లు అందుబాటులో లేకపోవడంతో దహెగాం మండల తహసీల్దార్ బికర్ణ దాస్ తన సొంత వాహనంలో ఆమెను హాస్పిటల్ కి తరలించారు. మరో పక్క పెద్ద వాగు ఉదృతం గా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురిఅవుతున్నారు అమరగొండ గ్రామంలో పెద్దవాగు పరిసనర ప్రాంతంలో ఉన్న పత్తి పంట నీట మునిగింది. దీనితో రైతులు లబోదిబోమంటున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com