సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు.. గదిలో బట్టలు మార్చడాన్ని వీడియో తీశాడు

0

dressing_room_apduniaసినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మోసానికి పాల్పడే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పలువురు యువతులతో పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నమ్మించి వారిని ఫోటో సెషన్ కోసం పిలిపించాడు. ఆపై ఆ యువతులు గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీసి వారిని వివిధ రకాలుగా బెదిరించేవాడు. మోసపోయిన ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు తాము కూడా నిఖిల్‌ చేతిలో మోసపోయామంటూ పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ మద్దిలపాలేనికి చెందిన వైడా నిఖిల్‌ (24) నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, ఫొటో సెషన్ కోసం రమ్మని యువతులు దుస్తులు మార్చడాన్ని వీడియో తీసేవాడు. ఈ బండారం కాస్త యువతుల ఫిర్యాదుతో బయటపడటంతో నిఖిల్ అరెస్టయ్యాడు.

Share.

Comments are closed.