మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో లవ్ ప్రపోజ్

0

love prapose_apduniaఆస్ట్రేలియాలోని మొసళ్ల పెంపక కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడు. బిల్ కొల్లెట్ అనే యువకుడు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో నాలుగున్నర మీటర్ల దూరంలో ఎల్వీస్ అనే మొసలి ఉండగానే అక్కడే మోకాళ్లపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్ చేసి అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. బిల్ కొల్లెట్ చేసిన వినూత్న ప్రపోజ్‌తో సంతృప్తి చెందిన ప్రియురాలు శియోభన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్‌క్లోజర్‌లోనే బిల్, శియోభన్‌ కౌగిలించుకొని లిప్ లాక్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వినూత్న ప్రపోజ్‌ను చూసిన జనం చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలిపారు. ఈ మొసలి సాక్షిగా ఒక్కటవుతున్న ఈ జంట వీడియో ప్రస్తుతం ఫేస్ బుక్‌లో వైరల్‌గా మారింది.

Share.

Comments are closed.