జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మంత్రి హరీష్ రావు 72వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టాన్ని తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 102 కొత్త పంచాయితీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా కంటి వెలుగు పథకమును తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించగానే నేటి నుండే అమలులోకి వస్తుందన్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలోని 23 టీములు 123 రోజులు కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి, ఒక లక్ష 96 వేల కంటి అద్దాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంచామని మంత్రి చెప్పారు. దేశంలో నే ఎక్కడలేని విధంగా రైతు బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2లక్షల 39 వేల 750 మంది రైతులకు గాను, ఒక లక్ష 34వేల 713 మంది రైతులను అర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. రైతు భీమా పథకం కు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థకు రైతు తరపున ప్రభుత్వమే చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద ఆపదలో ఉన్న రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం వెంటనే అందివ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రతి రైతుకు ఎకరానికి ఏడాదికి 8000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుండం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్ కాలానికి ఎకరానికి నాలుగు వేల చొప్పున 2లక్షల 67 వేల మంది రైతులకు 214 కోట్ల రూపాయల చెక్కులను అందివ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని అన్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల 4 వేల 441 ఎకరాలకు భూరికార్డుల ప్రక్షాళన చేసి 2లక్షల 57 వేల 751 మంది రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం జరిగిందన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న జిల్లా రైతాంగానికి రైతాంగానికి సాగునీరు అందించే దిశగా కాలేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రిజర్వాయర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లల ద్వారా త్రాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం 42వేల కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ పనులను అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com