మాజీ కెప్టెన్ పై సంచలన వ్యాఖ్యలు – గౌతమ్ గంభీర్

0

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌, విండీస్ మధ్య జరిగిన ఈడెన్ గార్డెన్స్‌ టీ ట్వంటీకి అజారుద్దీన్‌ను ఆహ్వానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ అకౌంట్‌లో తన కామెంట్స్ ట్వీట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజారుద్దీన్ బెల్ మోగించి ఆటను ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా… బీసిసిఐ, క్రికెట్ అసొసియేషన్ బెంగాల్‌తో పాటు సివొఎ ఓడిపోయాయంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. మ్యాచ్‌ఫిక్సింగ్‌తో నిషేధానికి గురైన వారిని ఇలా మ్యాచ్‌లను ప్రారంభించేందుకు ఆహ్వానించడం సరికాదన్నా డు. బీసిసిఐ,క్యాబ్‌తో పాటు సివొఎ దీనిని పట్టించుకోవడంపై విమర్శలు గుప్పించాడు. దీనిపై అజాహార్ ఇంకా స్పందించలేదు.

Share.

About Author

Leave A Reply