ఓవర్సీస్‌లో కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘గీత గోవిందం’

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. పాజిటివ్ టాక్ రావడంతో.. గోవిందుడు తొలి వారం ముగిసే సరికి మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరతాడని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి. రొటీన్ ప్రేమకథే అయినప్పటికీ.. పరశురాం డైరెక్షన్‌కు విజయ్, రష్మిక నటన తోడవడంతో.. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *