నెల రోజుల్లో రాళ్లు, మ‌ట్టికుప్ప‌లు పూర్తిగా తొల‌గించాలి – దాన‌కిషోర్‌

0

“నగరంలో నిర్మాణ వ్యర్థాలు, రాళ్లు, మట్టి కుప్పలు ఉండొద్దు. అవసరమైతే అదనంగా వ్యర్థాలు, చెత్త తరలింపుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తాను. నెలరోజుల్లో సిటీలో గణనీయమైన మార్పు రావాలి” అని జీహెచ్ఎంసీ కమీషనర్ దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు, రహదారుల నిర్వహణ పై త‌నిఖీలు నిర్వహించారు. జోనల్ కమీషనర్ హరిచందన కూడా పాల్గొన్న ఈ సందర్బంగా గుట్టల బేగంపేట, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, మెగా హిల్స్, మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల సంస్థ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా దానకిషోర్ పర్యటించారు. నగరం లోని అన్ని ఓపెన్ గార్బేజ్ పాయింట్లను జియో టాగింగ్ చేయాలని, గార్బేజ్ తరలింపు వాహనాలకు జీఐఎస్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా గార్బేజ్ తరలింపు ను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో గార్బేజ్ త‌ర‌లింపు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు సాంకేతికను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గుట్టల బేగంపేట వద్ద నిర్మాణంలోవున్న ఇంటి ముందు రోడ్ కు అడ్డంగా మెటీరియల్ వేయడంతో ఆ ఇంటి యజమానికి జరిమానా విధించిన‌ట్టు క‌మిష‌న‌ర్‌కు నార్త్‌జోనల్ కమీషనర్ హరిచందన తెలిపారు. మాదాపూర్ నుండి మెగాహిల్స్ వెళ్లే దారిలో రోడ్డు నిర్మాణం జరుగుతున్నా ద్విచక్ర వాహనాలు వెళ్లడాన్ని కమీషనర్ గమనించారు. రోడ్డు నిర్మాణం అయ్యేంతవరకు రోడ్డును పూర్తిగా మూసివేయాలని అన్నారు. న‌గ‌రంలో రాళ్లు, చెత్త కుప్ప‌ల‌ను మ‌రో నెల రోజుల్లోగా పూర్తిగా తొల‌గించ‌డానికి త‌గు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఓపెన్ గార్బేజ్ పాయింట్ల వ‌ద్ద స్వ‌చ్ఛ వాలెంటీర్ల‌ను నియ‌మించాల‌ని అన్నారు. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌తో పాటు ఉప ర‌హ‌దారుల‌లోనూ రోడ్ల నిర్వ‌హ‌ణ ప‌క‌డ్బందీగా చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్‌తో పాటు చందాన‌గ‌ర్ డిప్యూటి క‌మిష‌న‌ర్‌, శేరిలింగంప‌ల్లి డిప్యూటి క‌మిష‌న‌ర్ వెంక‌న్న‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్ ర‌వి పాల్గొన్నారు.

Share.

About Author

Leave A Reply