గ్యాస్ సిలిండెర్ పేలితే నష్టపరిహారం

వంట గ్యాస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైంది. అయితే ఒక్కోసారి జరిగే గ్యాస్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్కూట్, అజాగ్రత్త వల్ల పేలుడు సంభవిస్తుంది. సిలిండర్ పేలిన తక్షణమే హుటాహుటిని అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ప్రమాదాన్ని నివారించడం, ప్రమాద వివరాలను సేకరించడం చేస్తుంటారు. అయితే వంట గ్యాస్ లీకై ప్రమాదం సంభవిస్తే ఆ సిలిండర్ గ్యాస్ సంస్థలు బాధ్యత వహించి బీమా రూపంలో నష్ట పరిహారం అందజేయాలి. ఈ విషయం వినియోగదారుల్లో చాలా మందికి తెలియదు. వంట గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవిస్తే దానికి సంబంధించి బీమా క్లైమ్ చేసుకోవాలి: వంట గ్యాస్ వినియోగదారులకు ఆయా ఆయిల్ కంపెనీలు ప్రమాద బీమా సౌకర్యాన్ని పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ కింద బీమా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విషయం ఆయా కంపెనీలకు సంబంధించిన సిటిజన్ చార్టులో పేర్కొంటాయి. ఆయా కంపెనీల్లో రిజిస్టర్ అయిన ప్రతి ఖాతాదారునికి బీమా వర్తిస్తుంది. ఈ పాలసీల్లో థర్డ్ పార్టీ బీమా సౌకర్యం కూడా మిళితమై ఉంటుంది.
ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలితే తక్షణం దాని సంబంధిత డిస్ట్రిబ్యూటర్లకు ఈ విషయాన్ని తెలపాలి. అతను ఆ కంపెనీ సేల్స్ అధికారికి తెలుపుతారు. సేల్స్ అధికారి స్థానిక ఇన్సూరెన్స్ సర్వేయర్, అగ్రిమాపక శాఖ అధికారి వచ్చి సంఘటన చోటు చేసుకున్న ఇంటిని పరిశీలించి చుట్టుప్రక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం ఇస్సూరెన్స్‌ను క్లైమ్ చేస్తారు. ప్రమాదం జరిగిన ఇంటికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఎక్కడ బుక్ చేసుకుంటారో ఆ డీలర్ నుంచే ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అవుతుంది.
బీమా పరిహారం ఇలా…
గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో వ్యక్తి మృతి చెందితే సుమారు రూ.6 లక్షలు, గాయాలైతే రూ.25 వేల నుంచి 2 లక్షల వరకు, ప్రమాదం జరిగిన సమయంలో గృహోపకరణాలు, ప్రమాదం చోటు చేసుకున్న ఇల్లు డ్యామేజీకి గురైతే బీమా కంపెనీ సర్వేయర్ రిపోర్ట్ సక్రమంగా ఉంటే రూ.2 లక్షల వరకు పరిహారం కింద చెల్లిస్తారు. వినియోగదారుడి ఇంట్లో గ్యాస్ లీకేజీ వల్ల చుట్టు ప్రక్కల వారికి ప్రమాదం జరిగితే ప్రమాదానికి సంబంధించిన మొత్తం సుమారు రూ.40 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.
ఇలా అయితే వర్తించదు..
సిలిండర్ బుక్ చేసుకున్న డోర్ నెంబర్ గాక మరో డోర్ నెంబర్‌లో ప్రమాదం జరిగితే బీమా వర్తించదు. అలాగే సిలిండర్ లీకయినప్పుడు మాత్రమే బీమా క్లైమ్ చేసుకుంటారు. ప్రమాద ప్రాంత వివరాలు వారం రోజుల్లో బీమా కంపెనీకి తెలిపితే ఈ బీమా వర్తిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ప్రమాదం సంభవించిందని వినియోగదారుడిపై అనుమానం వస్తే, పోలీసు విచారణలో తేలితే బీమా రాదు.
డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం ఇవ్వాలి
సిలిండర్ పేలితే డిస్ట్రిబ్యూటర్‌కు వెంటనే వినియోగదారుడు సమాచాం ఇవ్వాలి. కంపెనీ బుక్ నెంబర్, రసీద్ నెంబర్, ప్రమాదం జరిగిన ఇంటి నెంబర్ బీమా కోరే ధరఖాస్తుతోపాటు డిస్ట్రిబ్యూటర్ వద్ద ఉంటే క్లైమ్ పూర్తి చేసి ఇవ్వాలి.
బీమాకు కావాల్సిన దృవీకరణ పత్రాలు
ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సందర్భంలో సంబంధిత అధికారి జారీచేసిన మరణ దృవీకరణ పత్రం, పోస్ట్‌మార్టం రిపోర్ట్, అగ్నిమాపక అధికారి నివేదిక, ప్రమాదం జరిగిన రిపోర్ట్ పత్రాలను అందించాలి. గాయపడిన సందర్భంలో వైద్యుడిని సంప్రదించినట్లు, మందులు కొన్నట్లు ఉన్న ఆధార పత్రాలు కావాలి. వైద్యశాలలో చికిత్సపొందినట్లుగా వైద్యుడి ధృవీకరణ ప్రతం, డిశ్చార్జి కార్డు ఇవ్వాలి. ఆస్థి నష్టం, బీమా కంపెనీ సర్వేయర్ చేసిన ధృవీకరణ ప్రతం సమర్పించాలి.
పౌరసరఫరాల శాఖకు సంబంధం ఉండదు
వంటగ్యాస్ వినియోగదారుడికి జరిగిన ప్రమాదం, బీమా విషయంలో పౌరసరఫరాల శాఖకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇదంతా వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్, సేల్స్ ఆఫీసర్, బీమా కంపెనీల మధ్య జరిగే వ్యవహారమే అని గమనించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com