నిండు కుండలా ప్రాజెక్టులు

కృష్ణా, తుంగభ్ర నదులపై ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతూనే ఉంది.ప్రాజెక్టుకు 2,38,977 లక్షల ఇన్‌ఫ్లో నమోదు కాగా ఐదు గేట్ల నుంచి నాగార్జున సాగర్‌కు, అలాగే వివిధ పథకాలకు కలిపి మొత్తం అవుట్‌ఫ్లోగా 2,38,977 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు, 215.807 టీఎంసీలుగా కాగా సోమవారం 882.30 అడుగులతో 200.6588 టీఎంసీలకు నీరు చేరుకొని నిండుకుండను తలపిస్తున్నది. కాగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు ఐదు గేట్ల ద్వారా 1లక్షా 34వేల 180 క్యూసెక్కులు, ఏపీ పవర్ హౌస్ ద్వారా 31,994 క్యూసెక్కులు, టీఎస్ పవర్ హౌస్ ద్వారా 42,378 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండగా హంద్రీనివాకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26,000 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికాలు వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టును అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం సందర్శించారు. జూరాలకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 1,10,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్ల్లో 1,04,629 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌లోని 11 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 60,629 క్యూసెక్కులు నీటిని నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1,044.127 అడుగుల ఎత్తులో 9.111టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 796 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 11,00 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్‌హౌస్ ద్వారా 44,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్లకు నింపేందుకు భీమా లిఫ్ట్-2 ద్వారా750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్నాటకలోని ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1,28,438 క్యూసెక్కులు, అవు ట్ ఫ్లో 1,25,569 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 121,364 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,12,358 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 98,644 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 57,622 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో ప్రాజెక్టులో 20 గేట్లలో 10 గేట్లను 2 ఫీట్లు, 10 గేట్లను 1ఫీట్ ఎత్తుకు ఎత్తి నీటిని స్పిల్ వే ద్వారా 43,240 క్యూసెక్కుల నీటిని ఎగువకు దిగువకు వదులుతున్నారు. దీం తో సుంకేశులకు ఇన్‌ఫ్లో 51,953 క్యూసెక్కులు ఉండటంలో బ్యారేజ్‌లో 14 గేట్లను 1 అడుగుమేరా ఎత్తి 49,868 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపునకు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com