ఆర్ఎస్ ఎస్ నేత నుంచి భారత రత్న వరకు

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవీయాకు కూడా భారతరత్న పురస్కారన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మాజీ ప్రధానుల జాబితాలో అటల్ బిహారీ వాజ్ పేయి 6వ నాయకుడిగా నిలిచారు.
అటల్ బీహారీ వాజ్ పేయి జీవిత ప్రస్థానం:
1926, డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోన బద్దేశ్వర్ లో వాజ్ పేయ్ జన్మించారు.
తల్లీదండ్రులు శ్రీకృష్ణ బిహారీ వాజిపాయ్, కృష్ణాదేవి
విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు
రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు
దేశసేవ కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
ఆర్ఎస్ఎస్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహారించారు.
1951లో జన్ సంఘ్ ను ఏర్పాటు చేశారు.
జన్ సంఘ్ వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
31 ఏళ్ల వయస్సులోనే లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం లో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు.
1968లో జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1980లో ఎల్ కే అద్వానీ, షెకావత్ లతో కలసి వాజ్ పేయి బీజేపీని స్థాపించారు
1996లో తొలిసారిగా వాజ్ పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సంఖ్యాబలం లేక 13 రోజులకే ప్రధాని పదవి నుంచి దిగిపోయారు
1998లో రెండోసారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామి అయిన అన్నాడీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రధాని పీఠం నుంచి వైదొలిగారు.
1999లో ముచ్చటగా మూడోసారి వాజ్ పేయి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. 2004 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. ఆ సమయంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. భారత్, పాక్ ల మధ్య చోటు చేసుకున్న కార్గిల్ యుద్ధం కూడా ఆయన హయాంలోనే జరిగింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే మూడు సార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అలాగే వాజ్ పేయి కూడా మూడు సార్లు ప్రధాని పీఠం అధిష్టించారు.
2005లో రాజకీయాల నుంచి వాజ్ పేయి నిష్క్రమించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com