నలుగురిని హత్య.. ఇంట్లోనే పాతేశారు

గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్యచేసి, ఇంటి వెనుక పూడ్చేశారు. ఈ దారుణ ఘటన కేరళాలోని ఇడుక్కి జిల్లా తొడుపుజాలో

చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో పొరుగింటివారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్నాతు కృష్ణన్ , అతని భార్య సుశీలా , కుమార్తె ఆర్షా, కుమారుడు అర్జున్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో, స్థానికులకు, పొరుగింట్లో నివసిస్తున్నవారికి

అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ఇంటి తలుపులు తెరచి చూసి షాకయ్యారు. ఇంట్లోని గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. శవాలను ఇంటి

వెనక్కి లాక్కెళ్లిన గుర్తులు ఉన్నాయి. ఇంటి వెనక్కి వెళ్లి చూసిన పోలీసులకు అక్కడ గొయ్యి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వి చూడగా.. నలుగురి శవాలు

బయటపడ్డాయి. దుండగులు కృష్ణన్ తలను చిధ్రం చేశారు. అతని భార్య చాతిపై తీవ్ర గాయాలున్నాయి. వారి కుమారుడు, కుమార్తెకు సైతం గాయాలున్నాయి. స్థానికులు

తెలిపిన వివరాలు ప్రకారం.. కృష్ణన్ క్షుద్రపూజలు చేసేవాడని, దీనిపై ఇటీవల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని తెలిసింది. వారంతా స్థానికులతో కానీ, కుటుంబ

సభ్యులతో కానీ మాట్లాడేవారు కాదని తెలిసింది. మృతుడి సోదరుడు యంజేశ్వర్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో కొంతమంది వ్యక్తులు కార్లలో ఇంటికి వచ్చేవారని చెప్పారు.

పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి, మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com