ఫ్లిప్ కార్ట్ సీఈవోను పదవి నుంచి తీసేశారు

0

binny bansal_apduniaఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ సహ స్థాపకుడు బిన్నీ బన్సల్ ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవి నుంచి సదరు సంస్థ తప్పించింది. ఆ స్థానంలో టైగర్ గ్లోబల్ మాజీ అధికారి కల్యాణ్ కృష్ణమూర్తిని నియమించారు. బిన్నీ బన్సల్ కు గ్రూప్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని అప్పగించారు. తాజాగా జరిగిన మార్పులు ఆశ్చర్యం కలుగజేసేవి కాదని, ఊహించినవేనని కంపెనీ వర్గాల అంటున్నాయి. ఫ్లిప్ కార్ట్ సంస్థను సమర్థవంతంగా నడపడంలో సహ స్థాపకులు సక్సెస్ కాకపోవడంతో వారిని ఆయా పదవుల నుంచి తప్పిస్తున్నారు.

Share.

Comments are closed.