తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్‌

0

భారత స్ప్రింటర్ హిమ దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూనైటెడ్ నేషషన్స్ ఛిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్)కి హిమదాస్‌ తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయింది. ఆమెను తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు యూనిసెఫ్ ప్రకటించింది. ‘యూనిసెఫ్ ఇండియా యూత్ అంబాసిడర్‌గా నన్ను నియమించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోని ఎంతోమంది చిన్నారులు తమ కలలు సాకారం చేసుకొనేందుకు నేను ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని హిమదాస్ ట్వీట్ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో హిమదాస్‌ మూడు పథకాలు సాధించింది. ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో కూడా స్వర్ణ పతకాన్ని సాధించింది.

Share.

About Author

Leave A Reply