ఉగ్ర గోదావరి…..

భద్రాచలంలో గోదావరి ఉరకలు వేస్తుంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షా లకు తోడు గోదావరి ఎగువ ప్రాంతంలో సైతం వర్షాలు పడడంతో గోదావరికి ఉదృతంగా వరద నీరు చేరుతుంది. రెండు రోజులు క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక స్ధాయికి చేరి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువున కురిసిన వర్షపు నీరు గోదావరికి చేరడంతో వరద ఉదృతి పెరుగుతుంది. ఒక్క రోజులోనే రెండవ ప్రమాద హెచ్చరిక స్ధాయిని దాటి మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలోకి వచ్చింది. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పివో, భద్రాచలం సబ్ కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తూ తమ సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నారు. పునరావాస కేంద్రాలలోకి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీరు, ఆహరం అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల పైకి వరద నీరు చేరే అవకాశం ఉండడంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.జిల్లాలో గోదావరి వరద ఉదృతి చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడ్ మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. భద్రాచలంలోని రామాలయం నది ఒడ్డున ఉన్న స్నానాల రేవు దగ్గర మెట్లు నీట మునిగాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వైపు వెళ్ళే రహదారిలో పలు చోట్ల రోడ్డు పైకి వరద నీరు చేరే అవకాశం ఉందని మండల తహశీల్దార్‌లు తెలిపారు. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి,తూరుబాక, రేగుబల్లి, గంగోలు గ్రామాలు వరద ముంపునకు గురవుతాయని అన్నారు. సున్నంబట్టి బాధితులకు బైరాగులపాడు ప్రాధమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని దుమ్ముగూడెం తహీశీల్దార్ హరిచంద్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com