జగన్ పై అసత్య ప్రచారాలు : వైసీపీ నేత భూమన

అనంతపురం లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలన మీద మాట్లాడకుండా ప్రతిపక్ష నేతజగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన రాజకీయ కార్యక్రమాలుగా మార్చుకుంటున్నారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజా కార్యక్రమాల్లో జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు డ్రైనేజి నోరు తో జగన్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పథకాన్ని విమర్శిస్తున్నావు . గాలేరు నగరి, హంద్రీనీవా నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టును చంద్రబాబు గెట్లేత్తి తాను పూర్తి చేశానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు కేంద్రంలో లాలూచీ పడి ప్రత్యేక హోదా ఉద్యమం నీరు గారుస్తున్నాడని అయన ఆరోపించారు. చంద్రబాబు పత్రికలను అడ్డపెట్టుకొని జగన్ పై భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు. రాయలసీమ చరిత్ర ఒక హింసలా చూపిస్తూ, రాయలసీమ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ప్రజా పోరాటాలే తన నమధేయంగా పనిచేస్తున్న జగన్ పై ప్రభుత్వ ధనంతో తిట్ల దండకం ఎత్తుకుంటున్నాడు. కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా తునిలో అలజడులు సృష్టించింది చంద్రబాబే నని అయన అన్నారు. ముద్రగడ పోరాటాన్ని నీరు గార్చారు. ముద్రగడ పోరాటానికి వైసీపీ మద్దతు తెలిపితే, అక్రమ కేసులు పెట్టారు. కాపు ఉద్యమానికి జగన్ అండగా ఉంటారు. కాపులను చంద్రబాబు చెప్పు కింద తేలు లాగా తొక్కిపడేశారు. హంద్రీనీవా కి చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చుపెట్టారో బహిరంగ చర్చకు సవాల్ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి ని అడ్డం పెట్టుకొని సీఎం పీఠంపై కూర్చున్నావ్. సోనియాగాంధీ తో కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టారు. ఓటుకు నోటు కేసులో దొంగలా చంద్రబాబు దొరికిపోయాడు. ఆ కేసును మాఫీ చేయడానికి మోడీ, కేసీఆర్ వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడని అయన అన్నారు. చంద్రబాబు కుప్పంకు చేసిన అభివృద్ధి పై, జగన్ పులివెందులకి చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని అడిగారు. ప్రజలు 2019 లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని భూమన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com