పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడి బహిష్కరణ ను ఎత్తివేయాలని బిజేపి డిమాండ్

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు నిరసిస్తూ నేటి ఉదయం బండారు దత్తాత్రేయ ఎంపి, మాజీ కేంద్ర మంత్రి మరియు ఎన్ రాంచందర్ రావు ఎంఎల్ సి గార్లనేతృత్వంలో విశ్వహిందూపరిషద్ కార్యకర్తలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ప్రజా ప్రతినిధులను మరియు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.హైదరాబాద్ కలెక్టరేట్ దిగ్బంధం లో బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి వారిని అరెస్ట్ చేసి నగర బహిష్కరణ విధించి నెల రోజులు గడిచినా, ప్రభుత్వం స్పందించక పోవడం తో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. మొదటి వారంలోనే ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ బి జె పి పార్లమెంట్ సభ్యుడను, శాసన సభ్యులు మరియు మండలి సభ్యుడు రాష్ట్ర గవర్నర్ గారికి విన్నవించి ప్రభుత్వం స్పందించకపోవడం తో ఈ రోజు విశ్వ హిందూ పరిషద్ ఆధ్వర్యంలో అన్ని జాతీయ భావాలు కలిగిన సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజా ప్రతినిధులను మరియు కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుంది. ఇప్పటివరకు పరిపూర్ణానంద స్వామి గారిని నగర బహిష్కరణ కి సరైన కారణాలను ప్రభుత్వం తెలుపలేదు. సామాజిక సమరసతను చెడగొట్టే అసాంఘిక శక్తులతో సమానంగా స్వామీజీని నగర బహిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం. మరో వైపు మజ్లీస్ నాయకులూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా వారితో స్నేహంచేస్తూ బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తూ జాతీయవాద శక్తులని మరియు దేశ భక్తులని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకి నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే స్వామి పరిపూర్ణానంద గారి నగర బహిష్కరణ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com